చిరంజీవి-బాలయ్యల సెంటిమెంటు పవన్ కు కూడా కలిసొస్తుంది..?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఈ చిత్రం ముఖ్యంగా మొగలల సామ్రాజ్యం కాలం నాటి కథ అన్నట్లుగా సమాచారం.

Balayya Bulldozes Chiranjeevi, Totally!ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో గ్లింప్స్ కూడా ఇప్పటికే విడుదల కాక ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ప్రేక్షకులు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చిరంజీవి వాల్తేర్ వీరయ్య ,బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో పవన్ వీరమల్లు సినిమా పైన కూడా చాలా నమ్మకంగా ఉన్నారు అభిమానులు.

Hari Hara Veera Mallu to resume soon!ముఖ్యంగా వీర అనే పదం చిరు బాలయ్య లకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లు లో కూడా వీర అనే అదే పదం ఉందని ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.ఇక డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కంటెంట్ పైన నమ్మకం ఉన్నవారు సినిమా టైటిల్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. మరి ఏ మేరకు అభిమానులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందో చూడాలి మరి.