బాలీవుడ్ లోకి ఎంతోమంది సౌత్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అందులో త్రిష ,కాజల్,తమన్నా, రకుల్, తాప్సి తదితర హీరోయిన్స్ వచ్చినవారే. ఇప్పుడు అమలాపాల్ కూడా ఏంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి పర్వాలేదనిపించుకుంది అమలాపాల్. అంతేకాకుండా ఇప్పటికే అమలాపాల్ కు దక్షిణాదిన అవకాశాలు తగ్గిన ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ అమ్మడు అక్కడ కూడా అగ్ర హీరోలతోనే నటిస్తున్నట్లుగా సమాచారం. అక్కడ అజయ్ దేవగన్ వంటి హీరోతో ‘భోలా’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతున్నట్లుగా సమాచారం. అక్కడ సెట్ లో ఈ బ్యూటీ చాలా సందడి చేసినట్లుగా బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అమలాపాల్ చేసే పాత్ర గురించి కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అమలాపాల్ ఈ చిత్రంలో బనారసి మహిళగా నటిస్తోంది. బనారస్ లో ఒక వారం పాటు నటీనటులకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
అజయ్ దేవగన్ సినిమాకి దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. ఇందులో టబు కూడా నటిస్తోందట. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ దృశ్యం 2 లో కూడా నటించారు. ‘భోలా’ చిత్రంలో అభిషేక్ బచ్చన్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 2019లో విడుదలైన తమిళ చిత్రం కైతికి అధికారిక హిందీ రీమేక్ ‘భోలా’ చిత్రంఅమలాపాల్ కి బాలీవుడ్లో మొదటి చిత్రమైన కానీ మొదటి హిందీ ప్రాజెక్ట్ మాత్రం కాదు. గతంలో పలు వెబ్ సిరీస్, తదితర పాత్రలు నటించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అగ్ర హీరో అయినా అజయ్ దేవగన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ ని దక్కించుకుందని చెప్పాలి. మరి చిత్రంతో బాలీవుడ్ లో సక్సెస్ అవుతుందేమో చూడాలి.