ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన నటుడు శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో పలు పాత్రలలో నటించి మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను అందుకున్నాడు శరత్ కుమార్. శరత్ కుమార్ ఇప్పుడు తీవ్ర అస్వస్థకు గురై ప్రస్తుతం చెన్నై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నటుడి భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి ఆసుపత్రికి హుటాహుటిగా చేరుకున్నారు.
అయితే ఆరోగ్యంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో తమిళ సినీవర్గాలలో అభిమానులు సైతం చాలా టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానుల సైతం ట్విట్టర్ రూపంలో తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖుల సైతం శరత్ కుమార్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని సైతం కోరుకుంటున్నారు. ఇక డిసెంబర్ 2020 వ సంవత్సరంలో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. కానీ శరత్ కుమార్ కు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు పర్యవేక్షణలో జాగ్రత్తగా చికిత్స పొందుతున్నట్లుగా తెలియజేశారు.
ఇక తండ్రి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తూ ఉండేది వరలక్ష్మి శరత్ కుమార్.గతంలో హైదరాబాదులో ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స చేయించారు. కానీ ఇప్పుడు మళ్లీ శరత్ కుమార్ అస్వస్థకు గురి కావడంతో సినివర్గాలలో మరింత టెన్షన్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.