న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు తెలుసా మీకు?

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాల హవా బాగా నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే అక్కడ ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే. అవును, నేటి రోజుల్లో సినిమా ఒక వారం ఆడితే గగనం అని చెప్పుకొనే పరిస్థితి వుంది. కోవిడ్ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు థియేటర్లో సినిమా చూడటానికి ప్రేక్షకులు కరువయ్యారు.

అయితే ఒక మంచి సినిమాకు మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. మనిషిని కదిలించే మనసుల్లో నిలిచే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే అలాంటి సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సినిమాల్లో ఒకటి “కేరాఫ్ కంచరపాలెం.” తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గుర్తుంచుకోదగ్గ ఒక చక్కటి ప్రయోగం ఈ సినిమా. ఇది ఒక క్లాసిక్ మూవీకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కనిపించే వారంతా కొత్త వారు కావడం విశేషం. కేవలం ఒక ఊరి వాళ్ళను మాత్రమే తీసుకొని నటింపచేసిన ప్రయోగం ఈ సినిమా.

ఇందులో నటించిన వారు నటనలో పీ.హెచ్.డీ లు వంటివి చేసిన నటులు కాదు. కేవలం వారి నాచురల్ నటనతో సినిమాను దర్శకుడు ఆసాంతం గొప్పగా మలిచారు. అయితే ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ సినిమానేనండీ ఇప్పటి వరకు న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డ మొట్టమొదటి తెలుగు సినిమా. మనిషి వందేళ్ల జీవితాన్ని, ఆయా దశల తాలూకు జ్ఞాపకాలను, బాధ్యతలను, గాయాలను, ప్రేమను, భయాలను మర్చిపోకుండా మనిషి గుండె పొరల్లో తట్టిలేపిన సినిమా ఇది.