సాయి పల్లవిని నమ్ముకున్న శ్రీలీల‌… సంక‌నాకిపోవాల్సిందేనా…!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ శ్రీ లీల. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత టాలీవుడ్ లో వరుస‌ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ తో నటించిన ధమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది.

Sreeleela as Pranavi in 'Dhamaka' movie with Ravi Teja

ఈ సినిమాలో రవితేజకు పోటీగా నటించి తన నటనతో శ్రీ లీల అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ లో కూడా శ్రీ లీల ఆదరహో అనిపించింది. రవితేజ- శ్రీ లీల కెమిస్ట్రీ కూడా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడనే చెప్పవచ్చు.అయితే ఇప్పుడు శ్రీ లీల గురించి ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలీల తన సినిమాల విషయంలో యంగ్ హీరోయిన్‌ సాయి పల్లవిని ఫాలో అవుతుందని తెలుస్తుంది.

Sai Pallavi's Secret Behind Being Herself And Happy | IWMBuzz

సాయి పల్లవి కూడా హీరోలతో సమానంగా తన నటనతో డ్యాన్స్ తో ఆకట్టుకుని గ్లామర్ షోకు దూరంగా ఉంటూ త‌న నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సాయి పల్లవి తరవాత మరో సినిమాను ప్రకటించలేదు.

ప్రధాన కారణం సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటంతో ఆమెకు దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇవ్వటం లేదని టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే ఇప్పుడు శ్రీ లీల కూడా సాయి పల్లవిని ఫాలో అయితే ఈమె కెరియర్ కూడా మధ్యలోనే ఆగిపోతుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. శ్రీ లీల ఏం చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ధమాకా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.