విడాకుల తర్వాత సమంతకు మిగిలింది అదేనా… అల్లాడిపోతున్న అక్కినేని మాజీ కోడలు..!

టాలీవుడ్‌కు ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. అప్పటి నుంచి12 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సమంత ఒంటరిగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన టాలెంట్ కి అదృష్టం కూడా తోడు కావడంతో సమంతను ఆపటం ఎవరి తరం కాలేదు. వరుస విజయాలతో దూసుకోబోతున్న సమంతకు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు.

పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో సమంత‌ నటించింది. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి విజయాన్ని కూడా దక్కించుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన యశోద సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంది.ఆ సినిమాకి అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకున్న హీరోయిన్ గా పేరు కూడా తెచ్చుకుంది. సమంత తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుని 2017లో పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట గత సంవత్సరం వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నాగచైతన్య కూడా విడాకులు తర్వాత వరుస‌ సినిమాలు చేసుకుంటూ తన కెరియర్ పై ఫోకస్ పెట్టాడు.

సమంత కూడా విడాకుల విషయాని పక్కనపెట్టి వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత విడాకులు తర్వాత ఆమె ఆస్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. సమంతకు హైదరాబాద్ లో లగ్జరీ అపార్ట్మెంట్స్ మ‌రియు ఖరీదైన పెంట్ హౌస్ ఉంది. దీని ధర రూ. 2 కోట్లు పైమాటే. స్నేహితులతో కలిసి సమంత కొన్ని వ్యాపారాలు కూడా చేస్తుంది. సాకీ అనే ఫ్యాషన్ బ్రాండ్ ఆమె రన్ చేస్తున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ ప్రొమోషన్స్ ద్వారా ఒక పెయిడ్ పోస్ట్ కి సమంత రూ. 10-20 లక్షలు వసూలు చేస్తారట.

 

ఒక్కో సినిమాకు సమంత రూ. 4-5 కోట్లు తీసుకుంటున్నారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ తో పాటు రెండు మూడు లగ్జరీ కార్లు ఆమెకు ఉన్నాయి. ఇతర ఎండార్స్మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఆదాయం సంపాదిస్తున్నారు. ముంబై, చెన్నైలలో సమంతకు ఖరీదైన ఇళ్ళు కూడా ఉన్న‌ట్టు సమాచారం. ఇక షేర్స్ రూపంలో కూడా ఆమె కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేసింది. మొత్తంగా చూసుకుంటే సమంత ఆస్తుల విలువ సుమ‌రు రూ. 97 కోట్లు వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు అని తెలుస్తుంది.