తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. అంతేకాకుండా తన అందంతో నటనతో కుర్రకారులను సైతం బాగానే ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే హీరోయిన్గా అవకాశాలను అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. చివరిగా ఈమె బొమ్మ బ్లాక్ బాస్టర్ చిత్రంలో నటించింది. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలకి జడ్జిగానే వ్యవహరిస్తూ ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మూగ జంతువులకు సంబంధించి తనకు సంబంధించి ఫోటోలకు సంబంధించి పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది రష్మి.
ఇక అప్పుడప్పుడు తనమీద ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ గౌతమ్ తనని ట్రోల్ చేసిన కొంతమంది నేటిజన్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి రీసెంట్గా శ్రీదేవి డ్రామా సెంటర్ షిఫ్ట్ అయిపోయిన రస్మి ప్రస్తుతం మాల్దీవ్ వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా వైట్ షర్టులో వేసుకొని పై బటన్స్ విప్పేసి కొంటె చూపులతో హీటెక్కించిన కొన్ని ఫోటోలను రష్మి షేర్ చేయగా వీటి పైన కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మిమ్ లలో కొంతమంది ఓ రేంజ్ లో రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. వీళ్ళు టీవీ యాంకర్లు.. కాదు హీరోయిన్లు కావడం ఎలాగో తెలియక అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయారు అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. “రష్మీ మీరు చెప్పింది నిజమే కానీ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మిస్సయ్యారు మేమంతా తెలుగు అమ్మాయిల ముంబై నుంచి దిగుమతి అయి ఉంటే కథ వేరే లాగా ఉండేదని తెలియజేస్తోంది. అలా ఉండి ఉంటే మేము కూడా టాప్ హీరోయిన్ల జాబితాలో చేరే వాళ్లను మమ్మల్ని ఇలా అయినా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ కౌంటర్ వేసింది”.