టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హవా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అర్థమవుతుంది. మొన్న చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు నిన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా నుండి ‘జై బాలయ్య’ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట చిరంజీవి ‘బాస్ పార్టీ’ పాట కన్నా కొంచెం బెటర్ గా అనిపించడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.
ఈ పాట ట్యూన్ విజయశాంతి హీరోయిన్‌గా వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో టైటిల్ పాటకు దగ్గరగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. వీటితో పాటు ఈ పాటలో వచ్చిన లిరిక్స్ ని కూడా మెగా అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నిన్న ఈ సాంగ్ రిలీజ్ కు ముందు వీరసింహారెడ్డి దర్శకుడు మలినేని గోపీచంద్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ సాంగులో కొన్ని లిరిక్స్ ను పోస్ట్ చేశాడు. సాంగ్ రిలీజ్ అయ్యాక అందులో వచ్చే లైన్స్ మెగా అభిమానులను టార్గెట్ చేసేలా ఉన్నాయి అంటూ వారు ఫైర్ అవుతున్నారు.
అందుకే వారు ఈ పాట రాసీన రామజోగయ్యశాస్త్రి మీద సోషల్ మీడియా వేదికగా ఆయనపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్‌లు చూసిన రామజోగయ్యశాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వాళ్లకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆయన తన పోస్ట్‌లో ‘ప్రతి పాటను ప్రాణం పెట్టి మమకారంతోనే రాస్తాను.. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ఉండండి.. అన్నట్టు.. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామా జోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను.. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు.. ఉంటే నా వైపు రాకండి’ అంటూ దండం పెట్టి చెబుతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన పోస్ట్ షేర్ చేశాడు.
జై బాలయ్య అంటూ వచ్చే పాటలు ‘రాజసం మీ ఇంటి పేరు.. పౌరుషం నీ వంటి పేరు.. రాయలోరి తేజం నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా.. ఆ మొల్తాడు కట్టిన మొగోడు ఇంకా పుట్టనే పుట్టలేదయ్యా’.. అనే లిరిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో మెగా-నందమూరి అభిమానులు మధ్య సినిమా విడుదల అవ్వకుండానే సంక్రాంతి వార్ మొదలైంది. ఇక సినిమా విడుదలయ్యాక వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో చూడాలి.
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను
సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..
ఉంటే ఇటు రాకండి🙏— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022