పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కాస్త బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,‘ఆచార్య’ వరుసగా ఫ్లాప్స్ కావడం పూజ కాస్త డైలమాలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే పూజా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీలో వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ సంవత్సరం ఆమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. సినిమా అవకాశాలు మాత్రం ఆమెని వెతుక్కుంటూ వెళ్తున్నాయి. రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయి. క్రిటిక్స్ ఈమె నటనని పొగిడారు. అందుకే ఈమె అవార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫెయిలైన ఆ తర్వాత రిలీజైన ‘బీస్ట్’ ‘ఆచార్య’ సినిమాలు మాత్రం ఆమెని కాస్త బాధించాయని చెప్పుకోవాలి.
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. త్రివిక్రమ్, బోయపాటి, పూరి వంటి మాస్ దర్శకులకు ముందుగా గుర్తొచ్చేది పూజానే. అందుకే ఈమె సినిమాల సంగతి ఎలావున్నా, ఇప్పటికీ తమ తమ సినిమాలలో బుక్ చేసుకోవాలని అనుకుంటూ వుంటారు. పూజా కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో కూడా ఈమధ్య మెరుస్తోంది. రంగస్థలం తర్వాత మరోసారి ఎఫ్ 3లో ఐటెం భామగా చిందేసిన సంగతి విదితమే. ఇంకోవిషయం ఏమంటే… పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలో మొదట ఈమెనే అనుకున్నారు. కానీ ఎందుకోగానీ కుదరలేదు. మరి నెక్స్ట్ ఇయర్ అయినా మన పొడుగుకాళ్ల సుందరిని అదృష్టం వరించాలని కోరుకుందాం.