JOBS: కేవలం పదవ తరగతితోనే..CISF లో ఉద్యోగాలు..!!

ఈ మధ్యకాలంలో వరుసగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వెలుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవాటిలో పలు ఉద్యోగాలు వెలబడుతూనే ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf) లో 787 కానిస్టేబుల్/ట్రేడ్ మాన్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ/పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుకుంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది రక్షణ శాఖ. ఇందులో పురుషులకు 641 పోస్ట్లు ఉండగా.. మహిళలకు 69 ఎక్స్ సర్వీస్ మెన్ లకు 77 పోస్టులు కలవు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు:
1). కానిస్టేబుల్ కుక్ పోస్టులు-304
2). కానిస్టేబుల్ క్లోబర్ పోస్టులు-6
3). కానిస్టేబుల్ టైలర్ పోస్టులు-27
4). కానిస్టేబుల్ బార్బర్ పోస్టులు-102
5). కానిస్టేబుల్ వాషర్ మాన్ పోస్టులు-118
6). కానిస్టేబుల్ స్వీపర్ పోస్టులు-199
7). కానిస్టేబుల్ పెయింటర్ పోస్టులు-1
8). కానిస్టేబుల్ మెసన్ పోస్టులు-12
9). కానిస్టేబుల్ ప్లంబర్ పోస్టులు-4
10). కానిస్టేబుల్ మాలి పోస్టులు-3
11). కానిస్టేబుల్ వెల్డర్ పోస్టులు-3

ఈ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు.. ITI ట్రేడ్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.అభ్యర్థుల వయస్సు ఆగస్టు-1,2022 వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ లోపల ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.SC/ST/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.