వెండితెరపై అక్కినేని నాగార్జున – అమల ఎంత ఫేమస్ జంటనో అలాగే బుల్లితెరపై సుధీర్ – రష్మి జంట కూడా అంత పాపులారిటీ సంపాదించుకుంది . అయితే అది రియల్ కపుల్ అయితే ఇది రియల్ కపుల్ .. ఇద్దరికీ పెళ్లి కాలేదు. కానీ ప్రతి ఈవెంట్ లో పెళ్లి చేసేస్తారు ఆ షో నిర్వహకులు. అంతేనా యూట్యూబ్ జంట అంటూ ఈ జంటకు వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చేశారు. అయితే భార్యాభర్తల మధ్య కెమిస్ట్రీ అయిన మిస్ అవుతుంది ఏమో కానీ .. వీళ్ళ మధ్య మాత్రం పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు .
ఎలాంటి మూమెంట్స్ అయినా సరే ఇద్దరు సింక్లో చేయడం ..ఎక్స్ ప్రేషన్స్ ని పట్టేసుకోవడం ..రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనిపించేలా నటించడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాగా ఈ జంటకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే ఇప్పటివరకు బుల్లితెరపై ఓ రేంజ్ లో అలరించిన ఈ జంట.. త్వరలోనే వెండితెరపై కూడా నటించబోతున్నట్లు ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. అఫ్ కోర్స్ చాలా కాలం నుంచి సుధీర్ – రష్మీ అభిమానులు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్లకు తెలియజేస్తున్నారు . బుల్లితెరపై కాదు మీ ఇద్దరు కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్గా చేయండి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇస్తామంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు .
కాగా వీళ్ళిద్దరూ త్వరలోనే హీరో హీరోయిన్గా తెరపై కనిపించబోతున్నట్లు ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. గాలోడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ గజ్జల గుర్రం టైటిల్ తో ఓ మూవీ చర్చలో ఉందని.. ఈ మూవీలో రష్మీ హీరోయిన్ గా నటిస్తుందని ..లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు అని ..నా పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని ..గజ్జల గుర్రం మూవీ కార్యరూపం దాల్చిన నేపథ్యంలో ఈ కాంబినేషన్లో మూవీ వస్తుందని అన్నారు. నిజంగా ఈ కాంబో తెరపై కనిపిస్తే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . అంతేకాదు త్వరలోనే సుధీర్ర్ – రష్మీ ఇద్దరు జంటగా మరో క్రేజీ షోను ప్లాన్ చేసింది మల్లెమాల అన్నట్లు కూడా న్యూస్లు వైరల్ అవుతున్నాయి . ఏది ఏమైనా సరే ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . మరి ఏం చేస్తారో ఈ జంట వేచి చూడాల్సిందే..!!