కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే కాబోలు, యంగ్ ఏజ్ లో ఉండగానే ఎంతోమంది హీరోస్ తప్పులు చేస్తున్నారు . కానీ ఆ తప్పులకు సరైన న్యాయంగా ఏదో ఒక సేఫ్టీ ప్రికాషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు . అయితే ఇక్కడ ఇప్పుడు ఈ హీరో చేసిన పని మాత్రం బాలీవుడ్ జనాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తండ్రిగా కాబోతున్నాడు . అదేంటి అతనికి ఇంకా పెళ్లి కాలేదు కదా ..? అని ఆలోచించకండి . ఈ రోజుల్లో పెళ్లి కాకుండా తల్లిదండ్రులు అవుతున్న హీరోలు హీరోయిన్లుబోలెడు మంది ఉన్నారు.
కాగా అర్జున్ కపూర్ గత కొంతకాలంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వీళ్ళు అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీళ్ళ ప్రవర్తించే తీరు అది అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది . ఇప్పటికే పలు ఫంక్షన్ లల్లో, పార్టీలలో, పబ్బులలో చేతిలో చేయి వేసుకొని..లిప్ కిస్ లు పెట్టుకుని మీడియా కంట పడ్డారు ఈ హాట్ జంట. అయితే రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో మలైకా అరోరా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా ట్రోలర్స్ తాతకాబోతున్న బోనీకపూర్ అంటూ ట్రోల్ చేశారు .
దీంతో అర్జున్ కపూర్ ఫైర్ అయ్యారు . మలైకాఅరోరా ప్రెగ్నెంట్ కాదు అంటూ తేల్చి చెప్పాడు. అంతే కాదు తనపై కావాలని ఎవరో కుట్ర చేస్తూ ఇలా పరువు తీస్తున్నారని మండిపడ్డారు . ఈ వార్తలు మరింత స్ప్రెడ్ కాకముందే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాది అంటూ మలైకా అరోరా ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ చేశాడు . దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సదురు వెబ్సైట్ పై మండిపడ్డాడు .
” ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమెప్రెగ్నెంట్ అంటూ మీరు ఎలా రాస్తారు ..ఒకరి పర్సనల్ లైఫ్ లో తొంగి చూడడం మంచి పద్ధతి కాదు . న్యూస్ ని కన్ఫర్మ్ చేసుకుని న్యూస్ గా రాయండి క్రియేట్ చేసి కంటెంట్ రాయకండి” అంటూ ఫైర్ అయ్యారు . అయితే అప్పటికే జరగాల్సిన అవసరం పూర్తిగా జరిగిపోయింది. బోనీకపూర్ ని అర్జున్ కపూర్ ని మలైకాని ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. ఏది ఏమైనా సరే ఈ రూమర్ నిజమైతే బాగుంటుంది అంటున్నారు బోనీకపూర్ ఫ్యాన్స్ ..!!