`వార‌సుడు`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. విజ‌య్ బ్రేక్ చేస్తాడా?

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలకు పోటీగా `వ‌రిసు(తెల‌గులో వారసుడు)` కూడా దిగబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థ‌ళ‌పతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హై బడ్జెట్ తో నిర్మించారు.

 

 

ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తమిళ తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ సైతం షురూ చేశారు. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతోంది.

అదేంటంటే సంక్రాంతి పండుగకు విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయ్ నటించిన `మాస్టర్` మిన‌హా సంక్రాంతికి విడుదలైన డబ్బింగ్ సినిమాలేవి ఈ మధ్యకాలంలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఎక్కడ `వారసుడు`కు రిపీట్ అవుతుందో అని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను విజయ్ బ్రేక్ చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.