టాలీవుడ్ లో నరసింహా బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఎప్పటినుంచి ఈ సినిమా సీక్వెళ్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఆదిత్య -999 మ్యాక్స్ టైటిల్‌తో విడుదల చేయబోతున్నట్లు బాలయ్య తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలకృష్ణ నే స్వయంగా కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మొదటిసారి ఈ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టి ఏకంగా రచయితగా మారి పెను సంచలనాన్ని సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అన్న విషయం పై అభిమానులు సర్వాత్ర ఆసక్తి నెలకొంది. టెక్నికల్ నేపథ్యంతో సాగుతున్న ఈ కథ బాలయ్య సిద్ధం చేయడం పై అభిమానుల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంపై అభిమానులు సందిగ్ధంగా ఉన్నారు. తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్య కొన్నిటిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం వచ్చే ఏడాది షూటింగ్ సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.
ముఖ్యంగా శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా గురించి తెలియజేస్తూ ఈ సినిమా చేస్తున్న సమయంలో శర్వానంద్ కు ఆదిత్య 369 సినిమా గుర్తుకొచ్చిందని తెలియజేశారు. వికాస సమయంలోనే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా పై స్పందిస్తూ వచ్చేయడాది ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లు బాలయ్య తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.