జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతటి పాపులారిటీ అందుకుందో అనసూయ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అనసూయ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండడం చేత బుల్లితెరపై అంతగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనసూయ సుడిగాలి సుదీర్ నటించిన గాలోడు సినిమా ఈవెంట్లో మెరిసింది.
ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం రోజున సాయంత్రం జరిగింది. ఇందులో సుధీర్ కి విషెస్ చెప్పేందుకు గెస్ట్ గా హాజరయ్యిందని సమాచారం. అయితే ఇందులో ఆమె సైడుగా ఇచ్చిన కొన్ని ఫోజులు ఇప్పుడు నెట్టెంటా వైరల్ గా మారుతున్నాయి.
అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సైడ్ ఫోజులలోనే అనసూయ యమహాటుగా ఉందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అనసూయ ధరించిన డ్రెస్ పైన కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గాలోడు సినిమా ఈవెంట్లో అనసూయ సుధీర్ పైన ప్రశంసల వర్షం కురిపించింది.
సాధారణ కమెడియన్ గా ఉన్న సుధీర్ ఇప్పుడు హీరో రేంజ్ కు ఎదిగారని టాలెంట్ ఎక్కువగా ఉన్న దాగదని.. అది ఒక వెలుతురులా దూసుకొస్తుందని తెలియజేసింది. ఇక గాలోడు సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మరొకవైపు అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అనసూయ జబర్దస్త్ ను వీడు బయటకు వచ్చినప్పుడు పలు విమర్శలు ఎదురైన ఆమె మాత్రం ఎలాంటి విషయాలపైన స్పందించలేదు. ప్రస్తుతం అనసూయక సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.