టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా నటించిన సినిమా యశోద. ఫస్ట్ టైం తన కెరియర్ లో పాన్ ఇండియా లెవెల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో సమంత సరో గేట్ మదర్ గా కనిపించిన తీరు జనాలను మైమరిపించింది . అంతే కాకుండా ఆ తర్వాత ధైర్యం గల అమ్మాయిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన స్టాంట్స్ సమంత ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఊపు ఊపేసాయి.
దీంతో సమంత నటించిన యశోద సినిమాను బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దుమ్ము దులిపేశారు. కాగా రీసెంట్గా సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో నటించిన సినిమా యశోదకు సిటి సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది . ఈ మూవీని ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు వీలు లేదంటూ తెగేసి చెప్పింది. ఈ మేతకు సినిమా ప్రొడక్షన్ టీంకు అధికారికంగా నోటీసులు పంపిన్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్ వల్ల తమ ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని.. ఈవిఏ ఐవిఎఫ్ ఆసుపత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేసింది . కాగా విచారణ జరిపిన కోర్ట్ యశోద సినిమాను విడుదల చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 19 వాయిదా వేస్తున్నట్లు తెలిపింది .ఇది నిజంగా సమంతకు బిగ్ షాక్ అనే చెప్పాలి .
విడాకుల తర్వాత ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోయిన్గా నటించిన యశోద మూవీ ..ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కోవడం సమంత కెరీర్ కు బిగ్గెస్ట్ మైనస్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు కొల్లగొడుతుంది ..ఆల్రెడీ ఇది బ్రేక్ ఇవెన్ టార్గెట్ ని దాటేసింది .. ఇలాంటి టైంలో సమంత నటించిన సినిమా ఓటీటీలో విడుదల కాకూడదు అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఫాన్స్ కు షాకింగ్ అనిపించింది . ఇది నిజంగా మేకర్స్ కి ఊహించిన దెబ్బనే చెప్పాలి. సినిమా విడుదల నిషేధించాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశించింది