చెన్నై బ్యూటీ త్రిష ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున ,ప్రభాస్, మహేష్ ఇలాంటి బిగ్ స్టార్స్ సినిమాలలో అవకాశాలు అందుకొని ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది .
మరీ ముఖ్యంగా వర్షం సినిమాలో త్రిష-ప్రభాస్ రొమాంటిక్ సీన్స్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పౌర్ణమి అనే సినిమాలో కూడా నటించారు . కాగా వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైన త్రిష రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చూసుకొని రంగంలోకి దిగింది . ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో పోనియన్ సెల్వన్ 1 అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించి జనాలను ఆకట్టుకుంది .
ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో త్రిష ఖాతాలో మంచి మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి . ఈ క్రమంలోనే త్రిష ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో తన తీరని కోరికలను కూడా తీర్చుకోవడానికి సిద్ధపడింది ఈ బ్యూటీ . రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్రిష స్టార్ హీరో కమలహాసన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతుందట. అయితే ఈ సినిమాలో ఆమె వ్యభిచారి పాత్ర చేయడానికి సిద్ధపడిందట. కమలహాసన్ అంటే త్రిష కు చాలా ఇష్టమట.
ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా కోరిక ఉండేదట. ఆల్రెడీ సినిమాలో కలిసి నటించింది . కాగా ఆయనతో ఎన్నిసార్లు కలిసి నటించిన ఆ కోరిక నాకు తీరదని ..ఆయనతో సినిమాలు చేస్తూనే ఉంటానని ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకొచ్చిందంట . ఈ క్రమంలోనే త్రిష కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్ .