ఆరుపదుల వయసులో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తూ మరింత దూసుకుపోతున్న నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది. అందుకే ఎంతోమంది నటీనటులు బాలయ్యతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇదిలా ఉండగా ఇటీవల బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ సినిమా లో బాలయ్య పక్కన నటించడానికి నిరాకరించిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
ఇకపోతే బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో మూడవసారి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇకపోతే అఖండ ప్రభంజనం వెండితెరపైనే కాదు బుల్లెతరపై కూడా చూపించింది. ఓటీటీ లో కూడా దుమ్మురేపే రీతిలో అదరగొట్టేసిందని చెప్పవచ్చు..
ఇప్పటికీ అఖండ గర్జన కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఇదిలా ఉండగా ఇటీవల సైమా లో కూడా అఖండ తనదైన శైలిలో అవార్డులను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలయ్యకు ఉత్తమ నటుడుగా సైమా అవార్డు లభించగా బెస్ట్ ఫీమేల్ సింగర్ గా జై బాలయ్య సాంగ్ కి గీతామాధురికి అవార్డు లభించింది. ఇక అంతేకాదు ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ తో అదరగొట్టేసిన సినిమా ఆటోగ్రాఫర్ రాంప్రసాద్ కి కూడా ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ అవార్డు లభించింది . ఇలా సైమా అవార్డ్స్ లో కూడా తన సత్తా చాటింది ఈ సినిమా .
ఈ సినిమాను మొదట కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత రకుల్ ప్రీతిసింగ్.. కేథరిన్.. పాయల్ రాజ్ పుత్.. ఇలా ఎంతో మంది హీరోయిన్లను బోయపాటి సంప్రదించినప్పుడు ఈ నలుగురు కూడా రిజెక్ట్ చేయడంతో చివరికి ప్రగ్యా జైస్వాల్ తో ఓకే చేయించారు. ఇక అలా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.