ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్లకు వెండి..డబ్బు..చీరలు ఇవ్వడానికి కారణం..?

కొంతమంది సెలబ్రిటీలు సైతం కొన్ని సెంటిమెంట్లను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలా సినిమాకి పనిచేసిన వారికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు అద్భుతమైన తెలుగు చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి షూటింగ్ సమయంలో హీరోయిన్లను కూడా చాలా పద్ధతిగా చూసుకునేవారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత హీరోయిన్లకు డబ్బులతో పాటు, వెండి పళ్లెంతో పట్టుచీరలు ఇచ్చి సన్మానం చేసేవారని సమాచారం. అలా ఎందుకు చేస్తారు అని ఒక ఇంటర్వ్యూలో అడగగా వాటి గురించి తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

sv krishna reddy birthday old memories photo gallery - Sakshi
ఈ పద్ధతి తన తల్లి నుంచి నేర్చుకున్నానని తెలియజేశారు. తన సినిమాలో నటించిన వారందరూ తనకి కూడా తోబుట్టు లాంటివారే అందుచేతనే వారు తమ సినిమాకు సహకరించినందుకు ఇలా చేస్తూ ఉంటానని ఎస్వి కృష్ణారెడ్డి తెలిపారు. ఇక నా తల్లి, భార్య కూతుర్లు కూడా ఆడవాళ్లే కాబట్టి వారిని గౌరవిస్తానని అంటూ తెలిపారు. తన సినిమాలలో కూడా స్రి ఆశ్లీలత ఉండదని అలా వినోదాన్ని పంచుకుంటూ కామెడీ తోని ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకువెళ్తానని కృష్ణారెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి మొదట చిన్న చిన్న సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను, మధ్యతరగతి విలువ కలిగిన సినిమాలను తీస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్ లో యమలీల, శుభలగ్నం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్గతుడు తదితర చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి.

No photo description available.
కేవలం డైరెక్టర్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా నటుడుగా రచయితగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. చివరిగా 2014లో యమలీల -2 సినిమా తీయగా ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత మరే సినిమాను తెరకెక్కించలేదు ఎస్వి కృష్ణారెడ్డి.