దర్శక ధీరుడు రాజమౌళి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచం మెచ్చే గొప్ప దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. తాను తీసే సినిమాని రాయి పై శిల్పం చెక్కినట్టు చెక్కుతూ తాను అనుకున్నది వచ్చేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఆయను జక్కన్న అంటారు. రాజమౌళి తన కెరియర్‌ను ముందుగా వాణిజ్య ప్రకటనతో, సీరియల్స్ తో ప్రారంభించి.. తర్వాత సినిమా డైరెక్టర్‌గా మారారు. రాజమౌళి ఇప్పుడు వరకు టాలీవుడ్ లో 12 సినిమాలు తీశాడు. తీసిన 12 సినిమాలు ఒక దానిని మించి మరొకటి సెన్సేషనల్ హిట్ సినిమాలుగా మారాయి.
ఆయన బాహుబలి సినిమాలతో భారతదేశ సినిమా రంగం అంత టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ స్థాయిని ప్రపంచ సినిమాల స్థాయికి తీసుకువెళ్లాడు. రాజమౌళి తన సినిమాల కోసం ఎంతో కష్టపడతారు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఒకే ఒక సంవత్సరంలో ఇంత పేరును తెచ్చుకోలేదు. ఎంతో కష్టపడితే కానీ రాజమౌళి ఈ స్థాయికి రాలేదు అన్నది నిజం. రాజమౌళి ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారడానికి ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనే కారణమట. ఆయన జీవితంలో ఎవరు ఊహించని సంఘటనలు జరిగాయి.
ఆ సంఘటనలను పాఠాలుగా మార్చుకుని రాజమౌళి ఈ స్థాయికి వచ్చాడు. ఆయన జీవితంలో జరిగిన ఎవరూ ఊహించని సంఘటన ఏమిటంటే.. రాజమౌళి చెల్లి. ఆమెను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా చేయాలనేది రాజమౌళి కోరిక. ఆమెను హీరోయిన్ చేసే బాధ్యతను రాజమౌళి తన భుజాల మీద వేసుకున్నాడు. ఆమెతో ఓ సినిమా కూడా తీసేందుకు షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా సగం షూటింగ్ కూడా పూర్తయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత రాజమౌళి కొన్ని కమర్షియల్ యాడ్స్ కు డైరెక్టర్ గా పని చేశాడు. యాడ్స్ తో తన క్రియేటివిటీ ని బయటికి తీశాడు.. దింతో తన గురువు దర్శకేంద్రుడు రాఘవేందర్రావు చనువుతో స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. కానీ తన చెల్లి శ్రీలేఖని హీరోయిన్ గా మాత్రం చేయలేకపోయాడు.