తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంతకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.
ఒకవైపు వెబ్ సిరీస్లలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్దగా అభిమానులకు టచ్లో లేదని చెప్పవచ్చు. తాజాగా కేవలం ఒక డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్ గా చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానుల సైతం సమంత ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన సమంతను ఇలా చూసి అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు.
సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి వంటి తదితర చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. సమంత పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు drools india సంస్థ కోసం ఒక యాడ్ చేసింది ఇందుకోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఎన్నడు లేని విధంగా సమంత తన ముఖంలోని మార్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో సమంతకు ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. పలువురు నేటిజన్లో సైతం సమంత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.