బండారు-అదీప్‌లకు మైనస్…కానీ ప్లస్ అదే..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆసక్తికరమైన ఫైట్ నడుస్తున్న స్థానాల్లో పెందుర్తి కూడా ఒకటి…ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ప్రజలు కంటిన్యూగా ఒకే పార్టీని గెలిపించడం అరుదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలవగా, 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి సరికొట్టా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి పెందుర్తిలో రాజకీయ పరిస్తితులు చూసుకుంటే..పార్టీల పరంగా వైసీపీ-టీడీపీలకు బలమైన క్యాడర్ ఉంది..రెండు పార్టీలు స్ట్రాంగ్‌గా ఉన్నాయి.

కానీ ఇక్కడ నాయకులకే మైనస్‌లు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు పెద్ద ప్లస్ లేదు..మొన్నటివరకు ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు..ఇప్పుడు కాస్త గడపగడపకు తిరుగుతున్నారు.  అలాగే నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి..ఇక అవినీతి, అక్రమాల ఆరోపణలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇవే ఎమ్మెల్యేకు పెద్ద మైనస్.

ఎమ్మెల్యే అదీప్‌కు మైనస్ ఉంది కదా అని..టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి పెద్ద ప్లస్ లేదు. ఈయన క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోకుండా…ఊరికే మీడియా ముందు హడావిడి చేస్తారు. అందుకే ఇక్కడ బండారుకు కూడా ప్లస్ లేదు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది. ఇక్కడ జనసేనకు కాస్త ఓటు బ్యాంక్ ఉంది. గెలిచే బలం లేదు గాని..గెలుపోటములని తారుమారు చేసే బలం ఉంది.

గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 20 వేల ఓట్ల వరకు వచ్చాయి..అటు టీడీపీ 28 వేల ఓట్ల తేడాతో వైసీపీపై ఓడిపోయింది. ఇప్పుడు వైసీపీ బలం తగ్గుతుంది..అటు టీడీపీ ఓటు బ్యాంక్ కాస్త పెరిగింది..జనసేనకు కూడా కాస్త పెరిగింది. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే డౌట్ లేకుండా పెందుర్తిలో గెలిచే ఛాన్స్ ఉంది. పొత్తు లేకపోతే మాత్రం వైసీపీ ఈజీగా గెలిచేస్తుంది.  మొత్తానికి పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది కాబట్టి..పెందుర్తిలో వైసీపీకే రిస్క్.