సీతారామం: మృణాల్ ఠాకూర్ తొలి సినిమా కష్టాలు తెలిస్తే షాక్..!!

మృణాల్ ఠాకూర్ .. ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతో సీత మహాలక్ష్మి గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యింది. ఇకపోతే అప్పటికే కుంకుమ భాగ్య అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు తెలుసు కానీ సినీ ప్రేక్షకులకు ఈమె గురించి తెలియదు . మలయాళం, తెలుగు, తమిళ్,కన్నడ, హిందీ భాషలో ప్రసారమైన ఈ సీరియల్ తో ఆమెకు కూడా ఒక రకమైన పేరు వచ్చింది అయితే ఈమె మొదటిసారి సల్మాన్ ఖాన్ సరసన నటించాల్సిందట. ఇక ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇకపోతే సుల్తాన్ సినిమాలో మొదటగా ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారట. ఇక సుల్తాన్ సినిమాలో అనుష్క పోషించిన పాత్రలో నిజానికి మృణాల్ నటించాలట.. అందుకోసం ఈమె కొన్ని రోజులు మల్ల యుద్ధంలో కూడా శిక్షణ తీసుకుందట .మూడు నెలల్లోనే 13 కిలోల బరువు కూడా తగ్గిందట . కానీ ఏమైందో తెలియదు అవకాశం చేజారి అనుష్క శర్మకు వెళ్ళిపోయింది అని వెల్లడించింది . ముఖ్యంగా ఎక్కువ బరువు తగ్గడంతోనే ఛాన్సులు కోల్పోయి ఉండవచ్చు అని కూడా ఆమె తెలిపింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు లవ్ సోనియా అనే సినిమా ఆడిషన్స్ వచ్చిందట . అలాగే ఎన్నో అమెరికన్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకుంది.

ఇదిలా వుండగా ఒక సినిమా లో వ్యభిచార గృహానికి తన తల్లి తన చెల్లిని అమ్మేసినప్పుడు తన చెల్లిని రక్షించడానికి అదే వ్యభిచార రొంపులోకి దిగి అక్కడే రెండు వారాల పాటు గడిపిందట. ఇక ఆ సినిమా షూటింగుకి కొన్ని రోజుల ముందు కోల్కతాలోని ఒక వేశ్య గృహంలో రెండు వారాలపాటు ఉన్న మృణాల్ అక్కడ వారి పరిస్థితిని చూసి వారి కథలు విన్నాక బీపీ కూడా డౌన్ అయిపోయిందట. అంతేకాదు నిద్రపోయిన ఏం చేసినా సరే వాళ్ళకథలే చెవుల్లో మారుమ్రోగుతుండేవట . కొన్నాళ్ళకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయేన ఈమెను దర్శకుడు కౌన్సిలింగ్ ఇచ్చి మరి మామూలు మనిషిని చేశారట . ఇక ఇలా ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం దేశం గర్వించదగ్గర నటిన గుర్తింపు తెచ్చుకుంటోంది మృణాల్ ఠాకూర్.