జపాన్ లో ఎన్టీఆర్… అసలు విషయం ఏమిటంటే..!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాస్ మోస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమాగా వచ్చిన త్రిబుల్ ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా నటించగా డివివి బ్యానర్ పై దానయ్య నిర్మించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరు ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్- రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. ఈ సినిమాలో ఎన్టీఆర్- రామ్ చరణ్ నటనకు గాను భారీ స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి.

RRR' Japan version.. Stunning poster going viral!

రాజమౌళి సినిమాతో మరో మెట్టు ఎక్కడానే చెప్పవచ్చు. ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా నిలిచిందని వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా జపాన్‌లో ఈనెల 21న ఎవరి ఊహించని స్థాయిలో విడుదల కాబోతుంది. ఇక చిత్ర‌ యూనిట్‌ సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లు జపాన్‌లో సినిమా యూనిట్ శరవేగంగా చేస్తుంది.

RRR: Jr NTR fights British in night schedule

తాజాగా ఈరోజు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జపాన్ స్థానిక మీడియాతో వెబ్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందనేది మనం చూడాలి.