కృష్ణాలో కొత్త ట్విస్ట్..లైన్‌లో బాడిగ వారసురాలు.!

కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈ సారి సత్తా చాటాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకెళుతుంది..గత ఎన్నికల్లో ఎలాగో చిత్తుగా ఓడిపోయింది..ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని, ఈ సారి గ్యారెంటీగా మంచి ఫలితం రాబట్టాలని చూస్తున్నారు. ఆ దిశగానే టీడీపీ అధినేత చంద్రబాబు…తమ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.  అలాగే ఈ సారి ఖచ్చితంగా గెలవడానికి కొన్ని కీలక మార్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. నిజానికి విజయవాడ పార్లమెంట్‌తో పోలిస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో టీడీపీ చాలా వీక్‌గా ఉంది.

మచిలీపట్నం పరిధిలో..గుడివాడ, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ సీట్లు ఉన్నాయి. వీటిల్లో పెడన, మచిలీపట్నం,పెనమలూరు స్థానాల్లో మాత్రమే టీడీపీ పికప్ అయింది. మిగిలిన స్థానాల్లో వీక్ గానే ఉంది. అయితే జనసేనతో పొత్తు ఉంటే టీడీపీకి కాస్త కలిసొచ్చేలా ఉంది.  అదే సమయంలో కొన్ని సీట్లలో భారీ మార్పులు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది.

కొన్ని సీట్లలో అభ్యర్ధులని మార్చవచ్చు అని ప్రచారం జరుగుతుంది. పెదనా పెడన సీటులో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుని నిలబెట్టి, మచిలీపట్నం ఎంపీ సీటులో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ వారసురాలు శ్రీదేవిని పోటీకి దింపుతారని ప్రచారం జరుగుతుంది. 2004లో బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచి..పార్లమెంట్ పరిధిలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2009లో ఓటమి పాలైన ఈయన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.

2019 ముందు బాడిగ వారసురాలు శ్రీదేవి టీడీపీలో చేరారు. అప్పుడు ఈమె పెడన సీటు ఆశించారు. కానీ అప్పుడు సీటు దక్కలేదు. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ సీటు ఇస్తారని ప్రచారం ఉంది. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది క్లారిటీ లేదు. ఎందుకంటే పెడన సీటు మళ్ళీ కాగిత కృష్ణప్రసాద్‌కే దక్కే ఛాన్స్ ఉంది..ఎందుకంటే అక్కడ కాగిత వారసుడుకు బాగా ప్లస్ ఉంది. ఈ సీటు కొనకళ్ళకు ఇవ్వడం జరిగే పని కాదు.

అలా అని మచిలీపట్నం పార్లమెంట్ సీటు కొనకళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సి ఉంటుంది..ఎందుకంటే ఆ పరిధిలో ఉండే గౌడ సామాజికవర్గం ఓట్లు పోయే ఛాన్స్ ఉంటుంది.  మరి బాడిగ వారసురాలుకు సీటు ఇస్తారా లేదా అనేది చూడాలి.