గాడ్ ఫాదర్ రివ్యూ.. అదే మైనస్ గా మారిందా..?

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా చూసే సమయం రానే వచ్చింది. ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఇదివరకే యూఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షోలు ముందుగానే మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా చాలా ట్రెండీగా మారుతోంది. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు రావడం జరిగింది. ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమాను తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.

GodFather box office prediction + what Chiranjeevi's last 5 films made -  Movies News
వాస్తవానికి మలయాళ లూసిఫర్ సినిమా ఆల్రెడీ తెలుగులో కూడా అందుబాటులో ఉన్నది. ఇక చిరంజీవి సినిమాలో ఎలా నటించారని విషయం మీద సర్వత్ర అభిమానులకు ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. తెలుగులో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఈ చిత్రం చేయడం అన్నది ఒక సాహసం అని చెప్పవచ్చు.అయితే చిరంజీవి ఆ ఛాలెంజ్ను తీసుకొని డైరెక్టర్ మెహర్ రాజా దర్శకత్వంలో నటించారు.ఇందులో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించి కొంతమంది సినీ ప్రేక్షకుల సైతం ప్లస్సులు, మైనస్లను కూడా తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా చిరంజీవి గబ్బర్ సింగ్ అని ఒక నేటిజెన్ కామెంట్లు చేయగా.. ఇప్పటివరకు రీయంట్రిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మరొక నేటిజన్ తెలియజేస్తున్నారు. చిరంజీవి కెరియర్ లోనే ఇది బెస్ట్ రోల్ అని మరి కొంతమంది అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు రేటింగ్ ప్రకారం 3.5 రేటింగ్ ఇచ్చినట్లుగా సమాచారం.

గాడ్ ఫాదర్ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్గా ఎంతో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అక్కడక్కడ కాస్త సాగదిత ఎక్కువగా ఉండటం జరిగిందట. ముఖ్యంగా తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ కూడా ప్రతి సీన్ కి చాలా ఎలివేట్ చేసిందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా 1700కు పైగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల అయింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఈ సినిమా మరింత ఊపు అందుకుందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా లూసిఫర్ సినిమా చూడని వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి ఎలా రాబడుతుందో చూడాలి.

https://twitter.com/MaheshM18869270/status/1577449436208574464?s=20&t=-kxdYndPTd4RyV4wHbGfGQ