కాంతారా హీరో తెలుగులో నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి నోట బాగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా. కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్ర దర్శకుడు హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు వెతుకుతున్నారు. ఇకపోతే కాంతారా హీరో గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి.. కర్ణాటకలోని కుందాపూర్ లో 1983 జూలై 7వ తేదీన జన్మించారు . హిందూ కుటుంబంలో పుట్టిన అతని తండ్రి పేరు భాస్కర్ శెట్టి.. తల్లి పేరు లక్ష్మి శెట్టి. రిషబ్ కి ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు కూడా ఉన్నాడు.

Meet BFF Rakshit and Rishab Shetty! - Rediff.com movies

కెరియర్ విషయానికొస్తే.. ఫిలిం డైరెక్షన్లో డిప్లమా చేసి.. కన్నడ దర్శకుడు ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్గా చేరారు. అతను తెరకెక్కించిన సైనైడ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలా తన సినీ జీవితం ప్రారంభమైంది. పలు టీవీ సీరియల్స్ లో కూడా పనిచేశారు. ఇక అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఇంట్లో వాళ్ళు ఆ పని మానేసి ఉద్యోగం చూసుకోమని సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. అలా 2010లో నటుడిగా కెరియర్ ప్రారంభించారు. నామ్ ఓరీలి ఒండినా అనే చిత్రంలో ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు . ఆ తర్వాత తుగ్లక్ సినిమాలో కూడా కనిపించారు.

Rishab Shetty forays into Telugu films with Mishan Impossible - News  Karnataka

ఆ తర్వాత డైరెక్టర్ గా మారి 2016లో రిషబ్ డైరెక్షన్లో రిక్కీ సినిమా వచ్చింది . ఈ మూవీలో హరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత చేసిన కిరిక్ పార్టీ మూవీ రిషబ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక టాలీవుడ్ సినిమాలో కూడా నటించారన్న సంగతి చాలామందికి తెలియదు. ఇదే ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో ఖలీల్ పాత్రలో నటించారు. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా , దర్శకుడిగా మరో చిత్రం కూడా చేయబోతున్నారు.