బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘సీతారామం’ బ్యూటీ..ఆ క్రేజీ ప్రాజెక్టులో మృణాల్ ఫిక్స్..!?

మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం. కానీ ఇప్పుడు అసలు అవసరం లేదు. తన పేరుకు పరిచయం చేయాల్సిన పని లేకుండా చేసుకుంది ఈ బ్యూటీ . రీసెంట్గా రిలీజ్ అయిన “సీతారామం” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా సీతారాం సినిమాలో నేషనల్ క్రష్ లాంటి బ్యూటీ రష్మిక మందన ఉన్నా కానీ అందరు మనసులను దోచేసుకుంది మృణాల్.

ఇప్పుడు ఎవరైనా సీత అంటే చాలు టక్కును మృణాల్ ఫేస్ నే మైండ్ లోకి రిజిస్టర్ అవుతుంది. అంతలా తన అసలు పేరు కన్నా సినిమా క్యారెక్టర్ లో పేరుతో పాపులర్ అయిపోయింది ఈ మృణాల ఠాకూర్. ఈమె అంతక ముందు హిందీలో కూడా సినిమాలు చేసింది . అయితే ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అందుకోలేకపోయింది . తన నటనకు మంచి మార్కులు వేయించుకుందే కానీ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు.

“సీతారామం” సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుస్స అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోని టాలీవుడ్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పనులను పూర్తి చేసుకున్న మృణాల్ త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలలో మెరవనున్నట్టు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన మృణాల్ ఠాకూర్ నటించే అవకాశం కొట్టేసింది అంటే అది కేవలం సీతారామం హిట్ కారణంగా అని చెప్పాలి.