అఖిల్‌ కి అంత సీన్ లేదు.. ఓ పిల్ల బచ్చాగాడు.. వైరల్ గా మారిన స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అలాంటి వారిలో ఒకరే అక్కినేని అఖిల్. తాత నాగేశ్వరరావు పేరు చెప్పుకొని.. తండ్రి నాగార్జున అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాదు అఖిల్ . అయితే ఇండస్ట్రీలోఖి వచ్చి చాలా కాలమే అయినా..ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు . అందులోనూ ఆ హిట్ మొత్తం హీరోయిన్ పూజ హెగ్డే ఖాతాలోనే పడిపోయింది .

కాగా, అఖిల్ కెరియర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమా “ఏజెంట్” . సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకుని ఉన్నారు . కాగా ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేస్తామంటూ గతంలో చిత్ర బృందం ప్రకటించింది . అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని.. మరో కొత్త డేట్ తో మీ ముందుకు వస్తామని అఫీషియల్ గా చెప్పింది .

నేడు దివాళి సందర్భంగా అక్కినేని హీరో బ్లాస్టింగ్ అప్డేట్ అందించాడు . ఈ క్రమంలోనే ఏజెంట్ కూడా సంక్రాంతి బరిలోకి దిగాడు. అయితే ఇప్పటికే సంక్రాంతి రేసులో నందమూరి బాలయ్య వీర సింహారెడ్డి , మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే అఖిల్ సంక్రాంతి రేసులోకి దిగడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే దీనిపై కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఇద్దరు బడా హీరోలతో బుల్లి పిట్ట లాంటి నువ్వు పోటీ పడగలవా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ సైతం ఇదే మాటలు మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . మరి చూడాలి అక్కినేని హీరో ఏం చేస్తాడో..?