తండ్రి బోనీ కపూర్ పై జాన్వీ సంచలన వ్యాఖ్యలు..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కామెంట్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి,,,  వరస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా సినిమాలకన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి తన పేరుని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంటుంది.

 

కాగా, రీసెంట్ గా జాన్వికపూర్ తన తండ్రి బోనికపూర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు బాలీవుడ్ జనాలు ఈ కామెంట్స్ పై పరోక్షకంగా స్పందిస్తూ..” నీకు మీ అమ్మకి బోనీ కపుర్ నే ఇంపార్టెంట్.. మిగతా వాళ్ళు పనికిరారు “అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ జాన్వి కపూర్ రీసెంట్గా తన సినిమా ప్రమోషన్ లో చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది .

మనకు తెలిసిందే ప్రస్తుతం జాన్వి కపూర్ ” మిలీ “అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాలో జాన్వి కపూర్ తన తండ్రి బోని కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన తండ్రితో కలిసి నటించడం పై ఎమోషనల్ గా స్పందించింది. “ఓ తండ్రి కూతుర్ల అనుబంధం ఇందులో ఆవిష్కరించామని ..తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ..తన తండ్రితో స్నేహపూర్వక బంధాన్ని పంచుకోవడం నాకు హ్యాపీగా ఉందని ” చెప్పుకొచ్చింది.

ఈ ప్రమోషన్స్ లో జాన్వికపూర్ తన తండ్రిని పొగడడం బాలీవుడ్ జనాలకి నచ్చలేదు . మనకు తెలిసిందే మొదటి నుంచి బోనీ కపూర్ అంటే బాలీవుడ్ లో కొందరికి పెద్దగా పడదు . ఆయన నెపోటిజం ఎక్కువ ఎంకరేజ్ చేస్తారని సామాన్య జనాలను తొక్కేస్తారని చెప్పుకొస్తారు. ఇలాంటి క్రమంలో జాన్వీ కపూర్ తన తండ్రి గురించి ఇలాంటి హంగామా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.