కాంతారా సినిమా బడ్జెట్ ఎంత తక్కువ, కలెక్షన్ ఎంత ఎక్కువో తెలుసా?

కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. మొన్న కేజీఎఫ్, నిన్న 777 చార్లీ, నేడు కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు కన్నడ సినిమాలను ఎవరూ కూడా చూడకపోయేవారు. వాటిని చాలా చులకనగా తీసి పడేసేవారు. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి శాండిల్ వుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తెలుగు, తమిళం తర్వాత ఇండియన్స్ మూవీ లవర్స్ ఎక్కువగా కన్నడ వైపే చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం కన్నడ మూవీ కాంతారా సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో కమ్ దర్శకుడు రిషభ్ శెట్టి దీనిని తెరకెక్కించాడు. ఈ మూవీలోని యాక్షన్, విజువల్స్‌, రిషభ్ శెట్టి టెర్రిఫిక్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు కుప్పలు తెప్పలుగా క్యూ కడుతున్నారు. ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే కన్నడలో ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఈ కాంతారా మూవీలోని సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాలన్నీ చూస్తూ ఉంటే దీనిని కనీసం వంద కోట్లు పెట్టి తీశారనే భావన కలుగుతోంది. కానీ నిజానికి ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.15 కోట్లు అట. ఇంత తక్కువ మనీతో రూపొందించిన ఈ మూవీ రెండు వారాల్లోనే ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇప్పుడు తమిళం, తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ అయిన ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. దీన్నిబట్టి ఈ కన్నడ మూవీ రూ.200 క్రోర్ క్లబ్‌లోకి ఈజీగా చేరుకోవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే మూవీ యూనిట్‌కి చాలా లాభాలు వస్తాయి. ఇక రిషభ్ శెట్టి తన నట విశ్వరూపం చూపించడాన్ని ప్రేక్షకులు బాగా మెచ్చుకుంటున్నారు. ఈ నటనకు ఉత్తమ నటుడిగా అతనికి కచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉందని కూడా మూవీ చూసిన వారు కామెంట్స్‌ చేస్తున్నారు.