అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!

గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు.

విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా అడ్డుకుని తీరతామని వైసీపీ మంత్రులు ఛాలెంజ్ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో ఓ జే‌ఏ‌సి  పెట్టేశారు. అలాగే రౌండే టేబుల్ సమావేశాలు పెడుతూ..అమరావతి, టీడీపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ ఫైర్ అవుతుంది. ఇక ఇందులో వైసీపీ రాజకీయం ఏంటి అనేది క్లియర్ గానే అర్ధమవుతుంది. రాజధాని సెంటిమెంట్‌తో ఉత్తరాంధ్రలో లబ్ది పొందాలనే కాన్సెప్ట్‌తో ఉన్నారు.

ఒకవేళ అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రలో సక్సెస్ అయితే..వైసీపీకి ఇబ్బంది..అందుకే ఆ పాదయాత్రని అడ్డుకోవాలని వైసీపీ చూస్తుంది. అయితే ఇప్పటివరకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు టీడీపీ కౌంటర్లు పెద్దగా ఇవ్వలేదు. కానీ తాజాగా అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ పెట్టి..ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసింది..అలాగే గతంలో ధర్మాన, బొత్స, తమ్మినేని లాంటి వారు అమరావతిలోనే రాజధాని ఉంటుందని మాట్లాడిన మాటలని, ఇప్పుడు విశాఖ అంటూ మాట మార్చిన అంశాలని వీడియోలు వేసి మరీ చూపిస్తున్నారు.

అలాగే తాము అమరావతి రాజధాని నినాదంతో ముందుకెళ్తామని, దమ్ముంటే మూడు రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు కౌంటర్లు ఇచ్చిన సమయంలోనే ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ వైసీపీపై ఫైర్ అయ్యారు. వరుసపెట్టి వైసీపీ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

ఇదే క్రమంలో అక్టోబర్ 15న విశాఖలో వైసీపీ అధ్వర్యంలో జే‌ఏ‌సి…విశాఖ గర్జన పేరుతో ర్యాలీ చేస్తుంది..దీనికి కౌంటరుగా “దేనికి గర్జనలు? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?” అంటూ వరుసపెట్టి పవన్..వైసీపీపై విరుచుకుపడ్డారు. అలాగే వైసీపీ గర్జన రోజే పవన్ విశాఖలో ఎంట్రీ ఇవ్వనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తానికి వైసీపీకి టీడీపీ-జనసేన గట్టిగానే కౌంటరు ఇచ్చేలా ఉన్నాయి.