టీడీపీ చేజేతులా కోల్పోయే సీట్లు ఇవేనా!

ఇప్పటివరకు వైసీపీ రాజకీయ దాడులని తట్టుకుని నిలబడిన టీడీపీ…ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏపీ రాజకీయాలు పూర్తిగా కక్షలతోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ చేతులో ఇప్పుడు చుక్కలు చూస్తున్న టీడీపీ..నెక్స్ట్ అధికారంలోకి వచ్చి వైసీపీకి చుక్కలు చూపించాలని చూస్తుంది. అందుకోసం చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు.

ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నారు. నెక్స్ట్ కూడా టీడీపీ అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు..అలాగే నేతలు దూకుడుగా పనిచేయాలని క్లాస్ ఇస్తున్నారు. ఈ సారి గెలుపు కోసం ఒక్క ఓటు కూడా ముఖ్యమనే విధంగా బాబు పనిచేస్తున్నారు.

ఇలాంటి పరిస్తితులు ఉండి కూడా కొందరు టీడీపీ నేతలు..సరిగ్గా పనిచేయకపోవడం పక్కన పెడితే…సొంత పార్టీనే ఓడించేలా కనిపిస్తున్నారు. చేజేతులా బలంగా ఉన్న పార్టీని ఓడించేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఎస్సీ రిజర్వడ్ సీట్లలో సొంత పార్టీ వాళ్లే పార్టీని ఓడించేలా కనిపిస్తున్నారు. అది కూడా ఎస్సీ సామాజికవర్గం కాని నాయకులు..ఎస్సీ నేతలు ఎక్కడ గెలిస్తే తమ పెత్తనం పోతుందనే భయంతో..సొంత పార్టీనే ఓడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఉదాహరణకు సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేకు పాజిటివ్ లేదు. ఇక్కడ టీడీపీ గెలుపుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే వేరే సామాజికవర్గం నేతలు..ఎస్సీ నేత ఎమ్మెల్యేగా గెలిస్తే తమకు ఇబ్బంది అని చెప్పి..పార్టీలో గ్రూపు తగాదాలు లేపుతున్నట్లు తెలుస్తోంది. అటు రైల్వేకోడూరులో అదే పరిస్తితి. 1999 వరకు ఇది టీడీపీ కంచుకోట. కానీ తర్వాత నుంచి ఎస్సీ నాయకులని ఎమ్మెల్యేగా చేయకూడదని..వేరే వర్గం నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో రైల్వే కోడూరులో టీడీపీ గెలుపుకు దూరమైంది. ఇప్పటికీ అదే పరిస్తితి కనిపిస్తోంది. ఇక కొవ్వూరు, చింతలపూడి, పామర్రు, తిరువూరు లాంటి స్థానాల్లో అదే పరిస్తితి.