సిట్టింగులకే సీట్లు..గంటాకు కూడా?

గతంలో ఎప్పుడూలేని విధంగా చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నిర్ణయమైన రోజులు తరబడి చర్చించి బాబు నిర్ణయాలు తీసుకునే వారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఖరారు చేసే విషయంలో కూడా. రేపు నామినేషన్ చివరికి అంటే…ఈరోజు కూడా అభ్యర్ధులని ఖరారు చేసిన రోజులు ఉన్నాయి. దీని వల్ల నష్టాలు ఎక్కువ జరిగాయి.

అందుకే ఈ సారి బాబు సూపర్ ఫాస్ట్ గా ముందుకెళుతున్నారు. ఎక్కువ సమయం చర్చలు జరపకుండా..ఉన్న పరిస్తితులని తెలుసుకుని అభ్యర్ధులని ఇప్పటినుంచే ఖరారు చేసేస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. ఇక తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు అని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే బాబు…సిట్టింగులకే సీట్లు అని ప్రకటించారు. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది..గాని ఒకరి విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. పార్టీలోని గంటా శ్రీనివాసరావుకు కూడా సీటు ఫిక్స్ చేశారా లేదా? అనేది తెలియడం లేదు.

గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. అందులో నలుగురు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి 19 మంది మిగిలారు. ఇప్పుడు సిట్టింగులకు సీట్లు అన్నారు. అంటే తనతో కలిపి మిగిలిన 18 మందికి సీట్లు ఫిక్స్ చేశారా? అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఆ 18 మందిలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన గెలిచిన దగ్గర నుంచి టీడీపీలో పనిచేయడం లేదు. అలాగే నియోజకవర్గంలో తిరగడం లేదు.

దీంతో ఆయనకు సీటు ఉందా? లేదా? అనేది తెలియడం లేదు. టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గంటాకు సీటు ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలో ఉంటారో లేదో తెలియదు..ఉన్నా సరే మళ్ళీ విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారో లేదో తెలియదు కాబట్టి బాబు..గంటాకు తప్ప మిగిలిన వారందరికీ సీట్లు కన్ఫామ్ చేశారని చెప్పొచ్చు.