గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. భారీగా విరాళం..!!

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాతో దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే అని చెప్పాలి. ఇకపోతే ఈయన తాజాగా తన స్వగ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం .. ఈయన 75వ జయంతి సందర్భంగా నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి ప్రశాంత్ నీల్ దాదాపుగా 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.Prashanth Neel Wiki, Age, Height, Wife, Children, Family, Biography & More  - WikiBio

ఇకపోతే ఈ విషయాన్ని ప్రముఖ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ అధినేత అయిన రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నీలకంఠాపురం గ్రామానికి ప్రశాంత్ నీల్ ఎందుకంత విరాళం ఇచ్చారు? ప్రశాంత్ – రఘువీరారెడ్డి కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయం తెలుసుకుందాం..KGF Director Prashanth Neel Hails From Madakasira, Anantapur in AP

కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎవరో కాదు .. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడైన సుభాష్ రెడ్డి కుమారుడే.. ప్రశాంత్ నీల్.. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి.. ప్రశాంత్ నీల్.. ఇక ఈయన అసలు పేరు ప్రశాంత్ నీలకంఠాపురం.. ప్రశాంత్ ఇలా తన పేరును ప్రశాంత్ నీల్ గా మార్చుకున్నారు. ఇకపోతే ఇటీవల సుభాష్ రెడ్డి నీలకంఠాపురం ఇటీవల చనిపోయారు .ఇక ఆయన పార్థివ దేహాన్ని నీలకంఠాపురంలోని ఖననం చేయడం జరిగింది. అంతేకాదు దర్శకుడు కే జి ఎఫ్ టు సినిమా విడుదల రోజు కూడా తన స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు.KGF 2 : రఘువీరారెడ్డికి, కేజీఎఫ్ 2 డైరెక్ట‌ర్‌కి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటో  తెలుసా? | The News Qube

ఇకపోతే మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి కూడా జన్మించారు. అటు 75వ స్వాతంత్ర దినోత్సవం, ఇటు తండ్రి 75 వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.