పెట్టుబడిలో సగం ధరకే అమ్ముడుపోయిన లైగర్ మూవీ.. సేఫేనా..?

డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వచ్చే నెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉండడంతో వరుస అప్డేట్లు చేస్తూ సినిమా పైన భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ , వీడియోలు తెగ వైరల్ గా మారాయి.Vijay Deverakonda and Not Karan Johar Conceived the Idea Behind Viral Liger Poster?

ఇక విజయ కొండ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కించిన చిత్రంగా పేర్కొంది.. రూ .160 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా కరణ్ జోహార్ ,పూరి జగన్నాథ్ ,చార్మి తదితరులు నిర్మించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇక ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు భారీగా ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఏదైనా సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేయాలి అంటే ఎక్కువగా సినిమా ట్రైలర్ , టీజర్ చూసిన తర్వాతనే ఒక అంచనా ఏర్పడుతూ ఉండేది. కానీ ఈ సినిమా ఎలాంటి అప్డేట్ లేకుండానే డిజిటల్ శాటిలైట్ హక్కులను రూ.98 కోట్ల రూపాయలకు డిస్నీ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకే అమ్ముడుపోయాయని .. ఇక పెట్టుబడిలో సగం మొత్తం రికవరీ అయినట్లే అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి లైగర్ సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ విడుదలవుతూ ప్రతిరోజు ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తున్నది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతున్నది.