దర్శకధీరుడు రాజమౌళి తన రెండు దశాబ్దాల కెరీర్లో అపజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు రాజమౌళి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్‌ను రాజమౌళి తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళి సినిమాలు.. వాటి కలెక్షన్ల లెక్కలు చూద్దాం.
1.స్టూడెంట్ నంబర్ 1 :
మూడు కోట్లుతో నిర్మితమైన ఈ స్టూడెంట్ 1 నాలుగు కోట్లుకు అమ్మగా… 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో గజాలా హీరోయిన్. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
2.సింహాద్రి :
ఎనిమిది కోట్లుతో రూపుదిద్దుకున్న సింహాద్రి రు. 13 కోట్లుకు అమ్మగా రు. 26 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో భూమిక చావ్లా, అంకిత హీరోయిన్లుగా చేశారు.
3. సై :
రు. 5 కోట్లు బడ్జెట్ తో నిర్మితమైన సై రు. 7 కోట్లుకు విక్రయించగా 9.5 కోట్లు వచ్చాయి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్గా నటించింది.
4. ఛత్రపతి :
రు. 10 కోట్లుతో నిర్మించిన ఛత్రపతి రు. 13 కోట్లుకు అమ్మగా రు. 21 కోట్లులు రాబట్టింది. ఈ సినిమాలో శ్రియా చరన్ హీరోయిన్.
5. విక్రమార్కుడు :
రు. 11 కోట్లుతో తెరకెక్కిన విక్రమార్కుడు రు.14 కోట్లుకు అమ్మగా రు. 19.50 కోట్లు వసూలు చేసింది. రవితేజకు జోడీగా అనుష్క నటించింది.
6. యమదొంగ :
రు. 18 కోట్లుతో రుపుదిద్దుకున్న యమదొంగ రు. 22 కోట్లుకు అమ్మడు పోయింది. రు. 28.75 కోట్లు కలక్షన్స్ సాధించింది. ప్రియమణి, మమతామోహన్ దాస్ హీరోయిన్లుగా చేశారు.
7. మగధీర :
రు. 44 కోట్లుతో తెరకెక్కిన మగధీర రు. 48 కోట్లుకు విక్రయించారు. ఈ సినిమా ఏకంగా రు. 151 కోట్లు కొల్లగొట్టింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
7. మర్యాదరామన్న :
రు. 14 కోట్లతో నిర్మితమైన మర్యాదరామన్న రు. 20 కోట్లకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వసూలు చేసింది.
సునీల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాలో సలోని హీరోయిన్.
9. ఈగ :
ఈగే ప్రధాన పాత్రలో భారీ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా రూపొందించారు. రు. 26 కోట్లతో నిర్మితమై రు. 32 కోట్లుకు విక్రయించారు. 42.30 కోట్లు కొల్లగొట్టింది. నాని – సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. సుదీప్ విలన్.
10. బాహుబలి ది బిగినింగ్ :
రు. 136 కోట్లుతో నిర్మించన బాహుబలి బిగినింగ్ రు. 191 కోట్లుకు అమ్మగా అది రు. 602 కోట్లు వసూలు చేసింది. అనుష్క, తమన్నా హీరోయిన్లు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.
11. బాహుబలి 2 :
ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి ది కంక్లూజన్ రు. 250 కోట్లుతో నిర్మితమై వంద రోజుల్లో రు. 1917 కోట్లు రాబట్టి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అనుష్క, తమన్నా హీరోయిన్లు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.
12. త్రిబుల్ ఆర్ :
రామ్‌చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా. రు. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రు. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.