ఎక్కడ మొదలు పెట్టాడో..అక్కడికే వచ్చి ఆగిన మారుతి..ఇదేం కర్మ రా బాబు..?

యస్.. ఇప్పుడు సినీ విశ్లేషకులు ఇదే మాట అంటున్నారు. కామెడీ సినిమాలతో తనదైన మార్క్ చూయించిన మారుతి..తన సినిమాల్లో హద్దులు మీరిన బూతులు కూడా అటాచ్ చేస్తుంటారు. ఎంత హెల్తీ కామెడీ తో నవ్విస్తాడో..అంతే ఢబుల్ మీనింగ్ డైలాగ్ లతో కవ్విస్తాడు కూడా. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే..ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.

దర్శకుడిగా ఆయన తీసిన ఫస్ట్ సినిమా ‘ఈ రోజుల్లో’ నండి..నిన్న కాక మొన్న వచ్చిన “పక్కా కమర్షీయల్” వరకు మారుతి సినిమాల్లో ఖచ్చితం గా ఢబుల్ మీనింగ్ డైలాగ్ లను చేర్చుతాడు . అయినా కానీ..సినిమాలు మంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంటూ..నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చి..ట్రెండ్ సెట్ చేశాడు అప్పట్లో ఈ మారుతి. కొత్త నటీనటుల్ని పెట్టి..తనదైన స్టైల్ లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో.. మారుతి తీసిన సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.

కాగా, రీసెంట్ గా మారుతి పక్కా కమర్షీయల్ సినిమా చూసిన జనాలు ..మారుతి ఏం మారలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పక్కా కమర్షీయల్ లో మారుతి వల్గర్ డోస్ బాగా ఎక్కువైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రావు రమేష్.. పెళ్లి , శోభనం ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు.. ఆ డైలాగుల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీ జనాలకు కొంచెం ఇబ్బందిగా అనిపించాయట. బయటకి చెప్పుకోలేని విధంగా బూతులు దట్టించేశాడు మారుతి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. నాని “భలే భలే మగాడివోయ్” సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కించిన మారుతి..ఇప్పుడు మళ్ళి బస్టాప్ సినిమా టైం తరహాలో వల్గర్ బూతులు వడ్డించడం తో జనాలు డిసప్పాయింట్ అయ్యారు. కొందరు , ఇదేం కర్మా రా బాబు ..మంచి స్టోరీ లైన్ లో ఇలా బూతులు రావడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. టోటల్ గా ఎలా స్టార్ట్ అయ్యాడో..అక్కడికే వచ్చి నిల్చున్నాడు ఈ మారుతి..అంటున్నారు సినీ విశ్లేషకులు.