మొద‌టి రోజే విమ‌ర్శ‌ల పాలైన మ‌హిళా మంత్రి.. అధిష్టానం సీరియ‌స్‌!

సీఎం జ‌గ‌న్ అనేక ల‌క్ష్యాల‌తో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను .. ఆశా వ‌హుల‌ను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న కొంద‌రు జూనియ‌ర్ల‌ను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వ‌రుస విజ‌యం అందుకుని.. మ‌ళ్లీ సీఎం కావాల‌ని.. జ‌గ‌న్ ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలోనే కొత్త అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వాస్త‌వానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి తీసుకోవ‌డంపై సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ త‌న ప‌నితాను చేసుకుపోయారు. ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని.. ఏదోజ‌రిగిపోతుం ద‌ని కూడా జ‌గ‌న్ ల‌క్ష్య పెట్టుకుండా ముందుకు సాగారు. ఈ నేప‌థ్యంలో ఇలా.. తొలిసారిమంత్రులు గా అయిన వారు.. ముఖ్యంగా జూనియ‌ర్లు.. ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత అంకిత భావంతో ప‌నిచేయాలి? అనేది ఆలోచిస్తే.. చాలా జాగ్ర‌త్త‌గా వారు ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే.. దీనికి భిన్నంగా ఒక మ‌హిళా నాయ‌కురాలు వ్య‌వ‌హ‌రించారంటూ.. వైసీపీ సోష‌ల్ మీడియాలో ఒక విమ‌ర్శ తెర‌మీదికి వ‌చ్చింది.

తాజాగా ఒక మహిళా మంత్రి, గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం అందుకున్న పిన్న వ‌య‌స్కు రాలు.. విష యం పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆమె త‌న శాఖ‌కు సంబంధించి ఒక చోట ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా ఉత్కంఠ‌కు గురైన ఉద్యోగులు.. మంత్రిగారు వ‌చ్చారు క‌దా.. అని అన్ని ఏర్పాట్లు చేసి.. ఇక్క‌డి స‌మ‌స్య‌లు ఆమెకు వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌లు ఓపిక‌గా వినాల్సిన మంత్రి.. ఆ ప‌నిచేయ‌డం మానేశారు.

ఈ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకుని.. ఆయ‌న‌కు మైకు ఇచ్చేశారు. దీంతో కీల‌క‌మైన విష‌యాల‌ను స‌ద‌రు అధికారే విన్నారు. సంబంధిత స‌మ‌స్య‌ల‌కు ఆయ‌నే ప‌రిష్కారం కూడా చెప్పారు. నిధులు ఎంత వ‌స్తున్నాయి.. ఎలా ఖ‌ర్చు చేయాలి.. ఏయే స‌మ‌స్య‌ల‌పై ఎలాంటి ప‌రిష్కారం చూపిస్తున్నారు. అన్నీ.. కూడా ఆయ‌నే పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. మ‌రి ఈ స‌మ‌యంలో స‌ద‌రు మహిళా మంత్రి ఏం చేశారంటే.. చేతులు రెండూ కింద‌కు(బ‌ల్ల కింద‌కు) పెట్టి సెల్ ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు… ప్ర‌ధానంగా ఎలివేట్ అయ్యాయి. ఈ విష‌యం తెలిసిన పార్టీ అధిష్టానం.. తొలి స‌మావేశంలోనే ఇలా చేయ‌డం ఏంటో తెలుసుకోవాల‌ని.. స‌ల‌హాదారును ఆదేశించిన‌ట్టు స‌మాచారం. చిత్రం ఏంటంటే.. స‌ద‌రు మంత్రి.. అధిష్టానానికి చాలా ద‌గ్గ‌ర మ‌నిషి అని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.