జ‌గ‌న్ కొత్త కేబినెట్‌.. వీళ్ల‌కు మామూలు షాక్ కాదుగా…!

తాజాగా మంత్రి వ‌ర్గ కూర్పులో నెల్లూరు జిల్లాకు అన్యాయం జ‌రిగిందా? గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన‌.. నెల్లూరు జిల్లాపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్రేమ‌త‌గ్గింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త కేబినెట్‌లో ఇద్ద‌రికి ఇక్క‌డ నుంచి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. మేక‌పాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ మంత్రులుగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి గౌతంరెడ్డి మ‌ర‌ణించారు. ఇప్పుడు జ‌రిగిన కొత్త కూర్పులో అనిల్‌ను తొల‌గించారు. మ‌రి వీరి స్థానంలో కేవ‌లం ఒకే ఒక్క‌రికి అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌నే కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.

స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న సీనియ‌ర్ నాయ‌కుడిగా.. కాకాని మం చి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రో మంత్రికి కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ, సాధ్యం కాలే దో.. లేక‌.. అర్హ‌త లేద‌ని.. అనుకున్నారో తెలియ‌దు కానీ.. మ‌రెవ‌రికీ జిల్లా నుంచి ప్రాధాన్యం ద‌క్క‌లే దు. కానీ, ఆశావ‌హుల జాబితాను ప‌రిశీలిస్తే.. మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రె డ్డి ఉన్నారు. అదే స‌య‌మంలో కోవూరు ఎమ్మెల్యే.. ప్ర‌సన్న కుమార్‌రెడ్డి, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటివారు ప్ర‌ముఖంగా ఉన్నారు.

అయితే.. వీరెవ‌రికీ కూడా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. దీంతో వైసీపీకి అత్యంత బ‌ల‌మైన నెల్లూరు జిల్లాలో తీవ్ర అసంతృప్తి సెగ‌లు వ‌స్తున్నాయి.“మీ వెంట న‌డిచి.. మీకు మ‌ద్ద‌తుగా ఉన్న‌ మాకు ఇదేనా గౌర‌వం అం టూ.. నాయ‌కులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతున్నారు. దీంతో ఈ జిల్లాలో ఏం జ‌రుగుతుందో అనే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ సామాజిక‌వ‌ర్గంలో యాద‌వుల‌కు రెండు స్థానాలు ఇచ్చి ప్రాధాన్యం క‌ల్పిస్తార‌ని.. అనుకున్నా.. కారుమూరు నాగేశ్వ‌ర‌రావు ఇచ్చి.. చేతులు దులుపుకొన్నారు.

పైగా.. ఆయ‌నపై ఇటీవ‌ల కాలంలో టీడీఆర్ బాండ్ల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో నెల్లూరు నుంచి మంత్రి అనిల్‌ను త‌ప్పించ‌డంపై.. నెల్లూరు వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. వైసీపీకి ఆయువుప‌ట్టు వంటి.. నెల్లూరు జిల్లాలో త‌గిన ప్రాధాన్యం ల‌భించ‌లేద‌ని అంటున్నారు.