RRR లో `నాటు నాటు` సాంగ్‌ని ఎక్క‌డ నుంచి కాపీ కొట్టారో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా దాదాపు నాలుగేళ్లు రూపొందించిన చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించ‌గా.. వారి స‌ర‌స‌న అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ మెరిసారు. కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. యావ‌త్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుద‌ల అయింది. రిలీజైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్న ఈ సినిమాలో కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ అద‌రగొట్టేశార‌ట‌. మ్యూజిక‌ల్‌గా కూడా ఈ సినిమా ఆక‌ట్టుకుంద‌ని అంటున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో `నాటు నాటు` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డుల‌ను కొల్ల‌గొట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్​ చరణ్​ కలిసి వేసిన స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌క‌రించాయి. పైగా ఈ పాటను ఇమిటేట్ చేస్తూ సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ వివిధ భాషల్లో ఎంతో మంది కవర్ సాంగ్స్​, రీల్స్ చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా.. గ‌త కొద్ది రోజుల నుంచీ ఈ సాంగ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర టాక్ వినిపిస్తోంది.

అదేంటంటే.. నాటు నాటు సాంగ్‌లో కొన్ని స్టెప్పుల‌ను కాపీ కొట్టారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ఓ టాక్ న‌డుస్తోంది. ఆఫ్రిక‌న్ పాట అయిన `Masaka Kids Africana Dancing`లో నుంచి కొన్ని స్టెప్పుల‌ను నాటు నాటు సాంగ్‌లో వాడేశార‌ని కొంద‌రు నెటిజ‌న్లు వీడియో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి ఈ విష‌యంపై స్పందించ‌లేదు.