టీడీపీలో మరో వారసుడు ఎంట్రీ…?

రాజకీయాల్లో నాయకుల వారసుల ఎంట్రీ సహజంగానే జరిగే ప్రక్రియ…సీనియర్ నేతలు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకురావడం, ఎన్నికల బరిలో నిలబెట్టడం ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియే..ఇక ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో అనేక మంది నేతల వారసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది…గత ఎన్నికల్లో కూడా చాలామంది వారసులు ఎన్నికల బరిలో దిగారు…వచ్చే ఎన్నికల్లో కూడా మరికొంతమంది వారసుల ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో మరో సీనియర్ నేత వారసుడు పోటీలో దిగడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది…ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లోనే దివంగత తంగిరాల ప్రభాకర్ రావు వారసురాలుగా తంగిరాల సౌమ్య..నందిగామ బరిలో దిగిన విషయం తెలిసిందే. తంగిరాల చనిపోవడంతో నందిగామ ఉపఎన్నిక వచ్చింది..ఆ ఉపఎన్నికలో సౌమ్య పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచి సౌమ్య తంగిరాల వారసురాలుగా రాజకీయం చేస్తుంది.

ఇక గత ఎన్నికల్లో కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పెడన బరిలో దిగిన విషయం తెలిసిందే..అయితే గత ఎన్నికల్లో జగన్ గాలిలో కృష్ణప్రసాద్ ఓడిపోయారు..వచ్చే ఎన్నికల్లో కూడా మరొకసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పామర్రు సీటు సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాకు దక్కిన విషయం తెలిసిందే. అటు ఎంపీ కేశినేని నాని తనయురాలు కేశినేని శ్వేత..విజయవాడ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఇలా కృష్ణా జిల్లా టీడీపీలో పలువురు నేతల వారసులు ఎంట్రీ ఇచ్చారు..ఇదే క్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ సైతం ఎన్నికల బరిలో దిగడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. మండలి వయసు మీద పడటంతో రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గా ఉండటం లేదు..దీంతో అవనిగడ్డలో టీడీపీ బాధ్యతలు వెంకట్రామ్ చూసుకుంటున్నారు…ఇక ఈయనే నెక్స్ట్ ఎన్నికల్లో అవనిగడ్డ బరిలో పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి కృష్ణా టీడీపీలో మరో వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది.