అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తుందే.. ఏ.. వాళ్ళ పై బన్నీ సీరియస్..?

ఈ మధ్య కాలంలో ఏదైన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ మూవీ పై ఏదో ఒక్క కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. ఒకవేళ ముందు చేయలేక పోయినా..సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీలోని సీన్ నచ్చలేదు అని కానీ, పాటలో మా జాతిని కించపరిచారని కాని..మా దేవుడి ని అవమానించారు అని కానీ కేసులు వేయడం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం.. వింటున్నాం. అయితే ఇదే విధంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి రిలీజ్ అయ్యి కోట్లు లాభాలు తెచ్చి పెట్టిన పుష్ప సినిమా పై కూడా కొందరు ప్రముఖులు మండిపడుతున్నారు.


ఆ “తగ్గేదేలే” అన్న డైలాగ్ ను పట్టుకుని బన్నీ నీ..ఆ సినిమాను తెరకెక్కించిన సుకుమార్ ని ఏకిపారేస్తున్నారు. రీసెంట్ గానే.. పుష్ప సినిమా పై గరికపాటి నరసింహారావు ప్రముఖ సిద్ధాంతి ఏ రేంజ్ లో విమర్శలు చేశారో మనకు తెలిసిందే. ఒక్క వీడియో తో పుష్ప సినిమా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసారు. అల్లు అర్జున్ ను, సుకుమార్ ను టార్గెట్ చేస్తూ..ఆయనకు ఆ సినిమాలో నచ్చని..పెట్టకూడనివి..చూడకూడనివి సీన్స్ గురించి మాట్లాడుతూ..దీనికి సుకుమార్ లేదా బన్నీ ఆన్సర్ ఇవ్వాలి అని కోరాడు. ఇక అంటే అప్పటి నుండి పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ..వరుసగా పొలిటీషియన్స్..ఊరు పేరు లేని గాసిప్ రాయుళ్లు..ఈ సినిమా పై భారీ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పుష్ప 2 సినిమా పై కూడా మరింత నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. దీంతో బన్నీ సీరియస్ అయ్యారట. ప్రెస్ మీట్ పెట్టి అందరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాళి అని అనుకున్నారట.


ఇదే విషయాని సుకుమార్ కి కూడా చెప్పగా..ఆయన వద్దు ఇది కరెక్ట్ టైం కాదు..మనల్ని బ్యాడ్ గా చిత్రీకరిస్తున్న ప్రతి ఒక్కరికి పుష్ప 2 సినిమాతో మనం బుద్ధి వచ్చేలా చేద్దాం అంటూ బన్నీ ని కూల్ చేసాడట. ఇక పుష్ప సినిమా పై ఫైర్ అవుతున్న వాళ్ల పై బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుందిగా..మీకు నచ్చని సీన్స్ ఉంటే అప్పుడు చెప్పాలి కానీ..ఇప్పుడు ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తుందే..ఏం.. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇక సుకుమార్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. పుష్ప రెండో భాగం సినిమా తో విమర్శించిన నోళ్ళు ప్రశంసించే విధంగా ఆయన స్క్రిప్ట్ ప్లాన్ చేశారట. మరి చూడాలి సుక్కు వాళ్ల కి ఎలాంటి సమాధానం ఇస్తారో..?


Leave a Reply

*