మంచు కుటుంబాన్ని జ‌గ‌న్‌ప‌క్క‌న పెట్టేశారా..!

సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి జ‌రిగిన వివాదంలో మంచు కుటుంబం ఏమైంది? అస‌లు వారి ప్ర‌స్తావ‌న కూడా లేకుండా.. ఏపీ స‌ర్కారుకు, సినిమా ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ పోయిందా? దీనిని బ‌ట్టి సిని రంగంలో మంచుకుంటుంబం ఒంట‌రి అయిందా? ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌. దాదాపు ఆరు మాసాల‌కు పైగా.. సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు, ధియోట‌ర్‌లప‌పై అధికారుల త‌నిఖీలు… ఇలా అనేక అంశాలు వ‌చ్చాయి. అయితే.. ఈ వివాదంలో ఎంతో మంది జోక్యం చేసుకున్నా.. ఈ స‌మ‌స్య మాత్రం ప‌రిష్కారం కాలేదు. తాజాగా చిరంజీవి జోక్యంతో ప‌రిష్కారం అయింద‌ని.. రాజ‌మౌళి వంటివారు స్పందించారు.

సినిమా ఇండస్ట్రీకీ చెందిన ప్రముఖులు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయి.. చ‌ర్చించారు. యువ హీరోలు.. చిరంజీవి వెంట‌వ‌వ‌చ్చి.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే.. రెండు రోజుల కింద‌ట‌.. మీడియాతో మాట్లాడిన‌.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు.. చిరంజీవి స‌మావేశాన్ని.. త‌క్కువ చేసి మాట్లాడారు. చిరంజీవి త‌న సొంత విష‌యాలు మాట్టాడుకునేందుకు సీఎంతో స‌మావేశం అయి ఉంటార‌ని అన్నారు. అయితే.. ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన రెండో రోజే… చిరు.. కొంత మంందితో వ‌చ్చిసీఎంతో చ‌ర్చించారు. ఈ బ్యాచ్‌లో ప్ర‌బాస్‌, మ‌హేష్ వంటివారు ఉన్నా.. కీల‌క‌మైన మంచు కుటుంబం ఎక్క‌డా లేదు.

దీంతో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ వెళ్ళకపోవడంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. గ‌తంలో ఈ వివాదంపై దర్శకుడు రాం గోపాల్ వర్మ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయి చర్చలు జరిపారు. తాజాగా ఈ అంశాలతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలపై చర్చలు జరిపేందుకు ఏపీ సీఎం క్యాంపు కార్యాలయలో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి తదితరులు సమావేశమయ్యారు. అనంతరం జగన్‌తో జరిపిన చర్చల గురించి ఒక్కొక్కరు స్పందించారు. జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయ‌య‌ని చెప్పారు.

మ‌రి కీల‌క‌మైన పొజిష‌న్‌లో మా అధ్య‌క్షుడిగా ఉన్న మంచు విష్ణు ఏం చేసిన‌ట్టు? ప‌ట్టుబ‌ట్టి ఈ ప‌ధ‌విలోకి వ‌చ్చిన మంచుకుంటుబం.. ఇండ‌స్ట్రీకి ఏం చేసిన‌ట్టు? భ‌విష్య‌త్తులో ఇది వారికి మాయ‌ని మ‌చ్చ‌గా మారిపోదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా.. జ‌గ‌న్‌తో త‌మ‌కు కుటుంబం పరంగా కూడా సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పుకొనే మంచుకుటుంబం.. ఇలా కీల‌క‌స‌మ‌యంలో కొంత చొర‌వ చూపి ఉంటే.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం అయ్యేలా చేసి ఉంటే.. క్రెడిట్‌వారి ఖాతాలోకే వెళ్లి ఉండేద‌ని.. ఇప్పుడు చిరు ఖాతాలోకి వెళ్లిపోయింద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై మంచు కుటుంబం ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.


Leave a Reply

*