ఆ రెండు అంశాలను నిరూపించగలిగితే.. సైదాబాద్ కేసు ముగిసినట్లే?

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసివేయాల్సి అవసరం ఏర్పడింది. కానీ సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది మృతదేహం రాజుదే అదే సాంకేతికంగా రుజువు చేయడం, రెండవది హత్యాచారం చేసింది రాజునే అని నిరూపించడం.

అయితే మృతదేహం రాజుది అని డీఎన్ఏ నమూనా ద్వారా విశ్లేషించన్నారు. ఇందుకోసం రక్తసంబంధీకుల డిఎన్ఏ తో పోల్చి నిర్ధారించనున్నారు. ఇక మరొక వైపు ఘటనా స్థలం నుంచి చిన్నారి దుస్తుల్ని, అలాగే అక్కడ ఉన్న క్లూస్ ని పోలీసు బృందాలు స్వాధీనం చేసుకొని వాటిపై నిందితుడు రాజు సెమన్ ( వీర్యం) నమూనాలు సేకరించనట్లుగా చెబుతున్నారు. అది రాజుదే అని నిరూపించగలిగితే ఈ కేసులో అతనే నిందితుడు అనే సాంకేతిక నిర్ధారణ అవుతుంది. అలాగే అటు డిఎన్ఎ ఇటు వీర్య నమూనాల విశ్లేషణ అంతా పొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలతో ముడిపడి ఉంది. ఇక ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ నుంచి ఆ రెండు నివేదికలు వచ్చిన తరువాత న్యాయస్థానంలో వాటిని సమర్పించిన తర్వాత ఈ కేసు ముగియనుంది.