ఇకపై ఈ కార్లను భారత్ లో చూడలేము..!

ఇటీవల అమెరికాకు చెందిన దిగ్గజ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ తమ కార్ల ప్లాంట్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. అందుచేతనే భారతదేశంలో ఈ కార్లు ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సనంద్ ,చెన్నై నగరాల్లో ఉన్న ఈ ప్లాంట్లను ఫోర్డ్ కంపెనీ మూసివేయడం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటంటే, కంపెనీకి భారీ నష్టాలు రావడం ..బహిరంగ మార్కెట్లో అభివృద్ధి లేకపోవడంతోనే ఫోర్డ్ కంపెనీ అధినేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ford Cars Are Incredible: Do Not Think Twice Before Buying A Ford Car! -  Harpreet Ford

ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఈ ఫోర్డ్ కార్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నా, దీని ధర కారణంగా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఇక దాదాపుగా కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఈ ఫోర్డ్ కార్లు అన్ని రకాల టెక్నాలజీలను కలిగి ఉన్నప్పటికీ, అత్యధిక ధర కారణంగా కొంతమంది ఇండియన్స్ కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఫోర్డ్ కంపెనీ తమ కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఏది ఏమైనా ఈ కంపెనీని మూసివేయడంతో భారతదేశంలో పలువురు ఉద్యోగస్తులు నిరుద్యోగులు కాక తప్పడం లేదు. చాలామంది ఉద్యోగాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.