అచ్యుత్ చనిపోవడానికి అసలు కారణం అదే అంటున్న నటుడు?

అచ్యుత్ సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఈయన పేరు వినగానే మనకు మొదటగా వినిపించే పేరు తమ్ముడు సినిమా. ఈ సినిమాలో నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈయన 42 ఏళ్ళ కే మరణించారు. అయితే ఈయన మరణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే అంటూ ప్రముఖ నటుడు కదంబరి కిరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అచ్యుత్ తమ్ముడు, బావగారు బాగున్నారా సినిమాలలో సహాయక పాత్రలు నటించారు. అంతేకాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు.

ఇక ఆ తర్వాత అయినా రమాదేవి అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. అచ్యుత్ 2002 డిసెంబర్ 26న గుండెపోటుతో మరణించాడని చెబుతున్నారు. కానీ ఈ విషయంపై స్పందించిన కదంబరి కిరణ్ అచ్యుత సినిమా నిర్మాత గా మారాలి అనుకొని స్నేహితులను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేశారని, కానీ వారు మోసం చేయడంతో ఆ బాధ తట్టుకోలేక మందుకు బానిసైన అని తెలిపారు. శరీరంలో కొన్ని అవయవాలు అతని హెచ్చరించినప్పటికీ ఆయన మందు మాత్రం మానుకోలేదు. అలా తాగి తాగి చివరికి అవయవాలు చెడిపోయి మరణించడం జరిగింది అంటూ కిరణ్ తెలిపారు.