నాకు చేతబడి చేశారు.. అమావాస్య అవుతే చాలంటూ నటుడు గగ్గోలు!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు లక్ష్మీనారాయణ గుప్తా అలియాస్ టార్జాన్. ఈయన ఎన్నో సినిమాలలో ఆర్టిస్ట్ గా, విలన్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెక్నాలజీ డెవలప్ అయిన ప్పటికీ చేతబడులు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనపై ఎవరో చేతబడి కూడా చేశారని తెలిపారు.

టార్జాన్ ఆంధ్రప్రదేశ్ లోని పరిగి సమీపంలోని రాపోలు అనే పల్లెటూరు కి చెందినవాడు. అయితే టార్జాన్ తండ్రి ఊరి సర్పంచ్ కావడంతో వారంటే గిట్టనివారు వారిపై చేతబడి చేయించారని, దీనితో రెండేళ్లపాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న అంటూ తెలిపాడు. ఈ చేతబడి వల్ల ఆ తల్లిదండ్రులు ఏమి తిన్నా, తాగిన కూడా వాంతులు చేసుకునేవారు అని తెలిపారు. అలా కడుపు నొప్పితో పదమూడేళ్ల నరకం చూసాము, దీనితో ఆస్తులను అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చేసాము అంటూ తెలిపాడు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని తెలిపారు. ఇప్పటికీ వాడి సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతామని అతను చెప్పుకొచ్చాడు.