ఆక‌ట్టుకుంటున్న `డియ‌ర్ మేఘ` టీజ‌ర్‌..!

July 22, 2021 at 1:00 pm

మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `డియ‌ర్ మేఘ‌`. యూత్‌ఫుల్ ట్రయాంగిల్ లవ్‌ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియ‌ర్ మేఘ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. `హాయ్‌ నేను మేఘా స్వరూప్‌. నాకు లవ్‌లో పీహెచ్‌డీ ఉంది` అంటూ మేఘా ఆకాశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్.. ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది.

అలాగే టీజ‌ర్‌లో.. `లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం`, `అతి ఎక్కువ సంతోషానికైనా బాధకైనా కారణం ప్రేమే అవుతుంది` వంటి డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. మొత్తానికి భావోద్వేగాలు కలబోసిన అందమైన, ఆసక్తికరమైన ట్రయాంగిల్ ల‌వ్ స్టోరీనే డియ‌ర్ మేఘ అని టీజ‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. విడుదల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

ఆక‌ట్టుకుంటున్న `డియ‌ర్ మేఘ` టీజ‌ర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts