నేను ఆనంద‌య్య మందు వేసుకున్నాః జ‌గ‌ప‌తిబాబు

ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య క‌రోనా మందు గురించి ఎంత పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొంత‌కాలంగా దీనిపై ఎన్నో అనుమానాలు మరెన్నో ట్విస్టులు నెల‌కొన్నాయి. అయితే దీనికి కొంత‌మంది స‌పోర్టు చేస్తే.. మ‌రికొంత మంది వ‌ద్దంటూ వాదించారు. కానీ ఎక్కువ‌మంది మాత్రం స‌పోర్టు చేశారు. ఇక ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఆనంద‌య్య మందుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మొద‌టి నుంచి ఆయ‌న ఆనంద‌య్య మందుకు మ‌ద్ద‌తు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడారు జ‌గ‌ప‌తిబాబు. అందరికంటే ముందుగా ఆనందయ్య క‌రోనా మందుని తీసుకున్న వారిలోతాను కూడా ఉన్నాన‌ని సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆనంద‌య్య మందు వ‌ల్లే త‌న‌కు క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రాలేద‌ని వెల్ల‌డించారు. ఆనంద‌య్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌న్నారు. అంద‌రూ న‌మ్మాల‌ని కోరారు. ఆయుర్వేదం ఎప్పుడూ మ‌నుషుల‌కు హాని చేయద‌ని, శరీరానికి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని జ‌గ‌ప‌తి చెప్పారు.